విడుదలకు సిద్దమౌతున్న ‘పిల్ల రాక్షసి’

pilla-rakshasiPilla Rakshasi ready for release

మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన ‘ఆన్ మ‌రియ క‌లిప్పిలాను’ తెలుగులో ‘పిల్ల రాక్షసి’ పేరుతో ముందుకొస్తున్నది .

‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి ‘పిల్ల రాక్షసి’ అందిస్తున్నారు .

ఓ చిన్నారి చేసిన సావాసం తో కూడిన స్టోరీలైన్ తో ఈ సినిమా రూపొంది మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించింది . ఈ చిత్రం ట్రైలర్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ సినిమా లో దుల్కర్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించారు . సారా అర్జున్‌ టైటిల్ పాత్ర‌లో కనిపిస్తారు . ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసున్నారు .

Watch Trailer