రైతులపై బలప్రయోగం వద్దు : పవన్ కళ్యాణ్

pawanఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై జనసేన అధినేత , నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. రాజధానికి భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించొద్దని పవన్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

ఏడాదిలో రెండు సార్లకంటే ఎక్కువ పండే భూములను రైతులు ఇవ్వటానికి ఇష్టపడరని, అలాంటి రైతులపై చట్టాలను ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేయొద్దని పవన్ సూచించారు. – See more at: http://expresstv.in/pawan-kalyan-on-land-acquistion-16970.aspx#sthash.8Ev37YCa.dpuf