చిరంజీవి రాజకీయంగా తొక్కేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను : పవన్‌కల్యాణ్‌

pawanజనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్‌ పరామర్శించి మద్దతు ప్రకటించారు.

చిరంజీవి గారిని రాజకీయంగా తొక్కేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను, ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న చిరంజీవి లాంటి మహా వ్యక్తిని కూడా కొందరు లబ్ధికోసం బలిపెట్టారు, పీఆర్పీని దెబ్బతీసిన స్వార్థ శక్తుల్ని ఏ ఒక్కరినీ నేను మర్చిపోలేదు

మార్పు కోసం చిరంజీవి ప్రయత్నం చేసారు కాని కొందరు ప్రజారాజ్యానికి ద్రోహం చేసారు. వాళ్లను నేను మరిచిపోలేదు, చిరంజీవికి ద్రోహం చేసిన అందరికి చెప్పుతోకొట్టినట్టు జనసేన సమాధానం చెబుతుంది. నా సినిమాలకు జై కొట్టి నా వెంట వచ్చేవాళ్లు కాదు… నా ఆలోచనా శక్తికి అనుగుణంగా అభిమానులు కార్యకర్తలు వెంట రావాలి.

నాకు నేను ధైర్యం తెచ్చుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా, ధైర్యం నింపే వ్యక్తి అండగా లేకే జనం సమస్యలపై ముందుకు రావడంలేదు. ప్రజా సమస్యలపై పోరాడటానికే జనసేన ఉంది . లాల్ బహదూర్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చా .

నేను అనే పదాన్ని ప్రజాసమస్యలపై పోరాడే సమయంలోనే వాడతా.
ప్రజా సమస్యలపై పోరాటానికే జనసేన పార్టీ పెట్టా… సరదాకి పార్టీ పెట్టలేదు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రక్తం అవసరం, చిన్న విత్తనమే మహా వృక్షమవుతుంది.
జనసేన కార్యకర్తలంతా మహా వృక్షాలవుతారు, ఆ నమ్మకం నాకుంది.