ఆమరణ నిరాహారదీక్ష చేస్తా : పవన్ కళ్యాణ్

pkజనసేన ఆవిర్భావ సభ వేదిక నుంచి ఆవేశంతో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం అన్నారు.

జనసేన పార్టీ ఆవిర్భవించి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ , రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా… అవసరమైతే కాదు… అవసరం పడుతుందనే నేను అనుకుంటున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ బలిదానాలు చేయొద్దు… అవసరమైతే పవన్ కల్యాణే బలిదానం చేస్తాడు , ఈ రోజు నుంచి ఎప్పుడైనా నేను ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం. ఆంధ్ర ప్రైడ్ మరియు తెలుగు స్వీయ-గౌరవం చాలా తేలికగా తీసుకోవద్దు, అన్నారు పవన్ కళ్యాణ్ .
పవన్ కళ్యాణ్, అధికార తెలుగుదేశం పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ, టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.