పవన్ కళ్యాణ్ నిజాలే మాట్లాడారు : చంద్రబాబునాయుడు

pawan-naiduజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన ఆత్మగౌరవ సభలో నిజాలే మాట్లాడారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు .

టీడీపీ ఎమ్మెల్యేలు పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల చంద్రబాబుకు వివరించారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా పోల్చారని వారు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

దీనికి స్పందిస్తూ , చంద్రబాబునాయుడు ఏపీ ప్రయోజనాల కోసం ఎవరు పోరాడినా అభ్యంతరం లేదన్నారు. ప్రత్యేకహోదా సాధించే ఫార్ములా ఏదైనా ఉంటే చెప్పొచ్చని అన్నారు. ఒక్క పక్క స్పెషల్ ప్యాకేజీ తీసుకుంటూనే విభజన హామీల అమలుకు ఒత్తిడి తెద్దామని, సూచించారు .

పవన్ ఆవేదనను తాము అర్థం చేసుకుంటామని, ఆయన ఏమైన మాట్లాడుకోనివ్వండి గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్ల పసిపాప , ప్యాకేజీని వద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ పై ఎవరు విమర్శలు చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు.