పవన్ కళ్యాణ్ ని రోడ్డు ఎక్కామన్న హీరో

Pawan-Kalyan-special-statusఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కాలని అంటున్నారు హీరో శివాజి.

ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అద్వర్యంలో నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిదిగా హజరైయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని, రాజకీయ నాయకులు తమ స్వర్ద ప్రయోజనాల కోసం నీచరాజకీయాలకు పాల్పడకుండా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తే ఎపికి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ లాంటి సత్తా ఉన్న నాయకుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చెస్తే స్పెషల్ స్టేటస్ సాధ్యమని అన్నారు శివాజీ .

టిడిపి ఎమ్.పిలు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారని , వారి రాజీనామాలు అవసరం లేదని , పార్లమెంట్ లో ఉంటూనే పోరాటం చేయాలనీ సూచించారు .