తెలుగు భాష కోసం చెన్నైలో పవన్ కల్యాణ్ దీక్ష

pawan1జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు భాష కోసం దీక్ష చేపట్టనున్నారు.

తమిళనాడు సర్కార్ జారి చేసిన నిర్భంధ తమిళ భాష జీవో నేపథ్యంలో, తమిళనాట తెలుగు పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ దీక్షకు దిగనున్నట్లు తెలుస్తోంది. అక్కడి తెలుగు సంఘాలన్ని ఆందోళన చేస్తున్నాయి. వారికి మద్దతుగా పవన్‌కళ్యాణ్‌ ఈ నెలాఖరులో చెన్నైలో దీక్ష చేపట్టనున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు తమిళనాడు సీఎం జయలలితను కలిశారు. దీక్ష పూర్తయ్యాక పవన్ కల్యాణ్ కూడా జయలలితతో భేటీ కానున్నారని సమాచారం .