ప్రజలకు అన్యాయం జరిగితే వూరుకోను : పవన్‌కల్యాణ్

pawan-naiduజనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో సుమారు మూడు గంటలపాటు జరిగిన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

అమరావతి శంకుస్థాపనకు తాను రాలేకపోయానని, అందుకు ఇప్పుడు చంద్రబాబును కలుసుకుని శుభాకాంక్షలు తెలిపినట్లు , రాజధాని భూముల కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు కృతజ్ఞతలు పవన్‌కల్యాణ్ తెలిపారు.

బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనులు ఇబ్బంది పడతారన్న వస్తున్న విషయం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు అందరితో మాట్లాడే చేస్తామని చెప్పారని అన్నారు. తన సూచనను చంద్రబాబు పాటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రానికి చెడు కానీ ,ప్రజలకు అన్యాయం జరిగినా తాను చూస్తూ వూరుకోననని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. కేంద్రం హామీలు నెరవేరుస్తానని చెప్పింది కాబట్టి వేచి చూస్తామన్నారు. ప్రధాని నుంచి తుది ప్రకటన వచ్చాక స్పందిస్తాం అని తెలిపారు. ఆందోళన తో స్పెషల్ స్టేటస్ రాదని, పద్ధతి ప్రకారమే సాధించుకోవాలన్నారు. రాయలసీమ సమస్యలు తదితర అంశాల గురించి చర్చించినట్లు చెప్పిన పవన్ కళ్యాణ్ .