పవన్ కళ్యాణ్ లెటర్ సారాంశం

Pawan-Kalyan-letterపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో లేకపోవడంతో , తన సొంత ఖర్చులతో ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించాలని నిర్ణయించుకున్నారు . ఈ సందర్బంగా ఓ లెటర్ రాసి కృతజ్ఞతలు తెలియజేశారు.

లెటర్ సారాంశం …”ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు.. కలలు ఖనిజాలుతో చేసిన యువత, మన దేశ భవిష్యత్ కు నావికులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర’ గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహాకావ్యం’ అయింది. నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహా గ్రంథాన్ని; దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారి కోసం అందుబాటులో ఉండాలన్నదే నా ఆకాంక్ష.. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి శేషేంద్ర గారి’ అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి, నాకీ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతజ్ఞతలు – పవన్ కళ్యాణ్.