పవన్ కళ్యాణ్ దళిత వ్యతిరేకి -కత్తి మహేష్

Mahesh-Kathi--PawanPawan Kalyan is anti-dalit – Mahesh kathi

‘రిజర్వేషన్లు లేని సమాజమే అంబేడ్కర్‌కు నివాళి’ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై కత్తి మహేష్ మండిపడ్డారు.

పేస్ బుక్ లో ఇలా పోస్ట్ పేట్టి పవన్ కళ్యాణ్ దళిత వ్యతిరేకి అన్నారు .

“రాజ్యాంగం మీద అవగాహన. రాజకీయ పరిణితి చాలా దూరం. కనీసం కామన్ సెన్స్ లేనిి ఇలాంటి స్టేట్మేంట్స్ పవన్ కళ్యాణ్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి. తరతరాల రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ, ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని ఇతను. దళిత సమస్యలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్విట్ చెయ్యని ఇతను. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు. కనీసం 1% కూడా లేని క్రిమిలేయర్ పెద్ద సమస్య అన్నట్టు పోజులిస్తున్నాడు. అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం మాట్లాడిన అక్షరం అక్షరం కనిపిస్తున్నాయి.
ఇప్పుడే కదా కాపులు తమ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ముద్రగడ గురించి మాట్లాడమంటే, సెన్సిటివ్ విషయాలపై స్పందించను అనే ఈ పలాయనవాది, దళితుల రిజర్వేషన్ల నిర్ములనే ధ్యేయం గా ఉన్నట్టు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూస్తే, ఇతని దళిత వ్యతిరేకత సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జనసేన పంథా అయితే, ఇదే ఇతగాడి “స్థాయి” అయితే, మనం తీవ్రంగా ఆలొచ్చించాల్సిన విషయం.”. కత్తి మహేష్ అన్నారు.