ఆర్దిక ఇబ్బందులలో పవన్ కల్యాణ్

pawanజనసేన అధినేత, పవన్ కల్యాణ్ ఆర్దిక ఇబ్బందులలో ఉన్నానని ప్రకటించారు. తనకు నెల గడవడమే కష్టంగా ఉందని కూడా చెబుతున్నారు.

ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు,నెల గడవాలంటేనే కష్టంగా ఉందని, స్టాఫ్‌కు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని పవన్ కల్యాణ్ అన్నరు.ఐతే , 2019 ఎన్నికల్లో జనసేన కచ్చితంగా పోటీ చేస్తోందని ప్రకటించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు టిడిపిలోకి వెళుతున్న నేపధ్యంలో , అదికారం కోసం పార్టీలు మారడం సరికాదని ఆయన అన్నారు. ప్రజారాజ్యంలో ఉన్నపుడు కొన్ని పరిమితులు ఉన్నాయని , ఏమి మాట్లాడినా చిరంజీవి బాద్యత వహించాల్సి వచ్చేదని అన్నారు.. చిరంజీవి ని జనసేనలోకి రావాలని అడగనని, ఆయన పూర్తి స్థాయి కాంగ్రెస్ వాది అని అన్నారు.