చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్

pawan-chiranjeevi-houseమెగాస్టార్ చిరంజీవికి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు కలిసారు, చాలా కాలం తర్వాత పవన్ చిరు నివాసానికి వెళ్లారు, చిరంజీవికి పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరుగబోతున్నాయి. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల నుండి పలువురు ప్రముఖులు ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాబోతున్నారు. హయత్ లో జరిగే బర్త్ డే సెలబ్రేషన్స్ లోనూ పవన్ పాల్గొంటారు.

శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. పవర్ స్టార్ కావాలంటూ గోల చేశారు అభిమానులు , పవన్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడంతో నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే వెళ్లి ఎందుకు రాలేదో అని పవన్ ను అడగాలని వారిపై సీరియస్ అయ్యారు నాగబాబు.

సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన భార్య జయాబచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, అతడి కుటుంబ సభ్యులు, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, శ్రీదేవి, బోనీ కపూర్‌, టబూ ఇలా పలువురు బాలీవుడ్‌ స్టార్స్ ఈ బర్త్ డే వేడుకలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌ ఈ పార్టీని ఆర్గనైజ్ చేసున్నారు