పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి :పవన్‌కల్యాణ్‌

DQbFsP1U8AARetSపోలవరం ప్రాజెక్టు సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు .

మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కాలంలో చేసినా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. నిర్మాణం జాప్యం జరిగే కొద్దీ వ్యయం విపరీతంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలున్నాయి… పోలవరం ఏ ఒక్క పార్టీదో… ఏ ఒక్క ప్రభుత్వానిదో కాదు. పోలవరం విషయంలో నేను ఎవరినీ నిందించడంలేదు, పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. పోలవరం చాలా కష్టమైన… ఛాలెంజింగ్ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలించాలి.

ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు సర్వసాధారణం… ఉన్న ప్రాజెక్టు ఆపేస్తే చాలా నష్టం… కేంద్రానికి లెక్కలు చూపిస్తే స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే లెక్కలు ఎందుకు చెప్పదు… రాష్ట్ర ప్రభుత్వం నిజాలు దాస్తున్న కొద్ది నాకు కూడా సందేహాలు కలుగుతున్నాయి. పోలవరంపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి… అప్పటికి కూడా కేంద్రం స్పందించకపోతే మీతో కలిసి నేను కూడా పోరాటం చేస్తా. 2018 నాటికి పోలవరం పూర్తి కావడం అసాధ్యం, సెక్రటేరియేట్‌ను కట్టలేనివాళ్లు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?.