యనమల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

pawan-yanamalaజనసేన నేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో మంత్రి యనమల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు .

జనసేన నేత ట్విట్టర్ లో ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు .సినిమా పరిశ్రమకి హైదరాబాద్ లో ఇచ్చినివి కొండలు..బహుళ పంటలు పండే పొలాలు కాదు ,ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంట. పైగా..హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ నాకైతే స్టూడియోలు లేవు.

నేను ఎంతోబాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందిచడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చెయ్యడం వారికే చెల్లింది. నేను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి ,పెనుమాక తదితర నది పరివాహక గ్రామాల రైతులిని కలుస్తాను.