మునికోటి కుటంబసభ్యులకు పవన్ కళ్యాణ్ సానుభూతి

munikoti-reddy-pawan-kalyanఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతి సభలో నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసిన మునికోటి చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 95 శాతం పైగా తీవ్ర గాయాలు అవ్వడంతో అతడ్ని రక్షించలేకపోయినట్టు వైద్యులు వివరించారు.

దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తన స్పందన తెలిపారు , మునికోటి చనిపొవటం నాకు చాల బాధ కలిగించింది; వారి కుటంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి ని తెలియ చేస్తున్నాను. అని త్వీట్ చేసారు .

పోస్టుమార్టం తర్వాత మునికోటి బౌతిక కాయాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి అదికారులు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్ తో సభ నిర్వహించిన సమయంలో ఈ ఘటన జరిగింది.ముని కోటి వయసు నలభై ఒక్క ఏళ్లు.