భీమవరం ఘటనను ఖండించిన పవన్ కళ్యాణ్

pawanపశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీని చించిన తరువాత నెలకొన్నా ఉద్రిక్త పరిస్థితులను పవన్‌ కల్యాణ్‌ భీమవరంలోనే ఉన్న ‘చిరు పవన తేజం’ రాష్ట్ర అధ్యక్షుడు ఉండపల్లి రమేశ్‌నాయుడు, కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, కన్వీనర్‌ ఆరేటి ప్రకాశ్‌లను ఫోన్లో లో అడిగి తెలుసుకొన్నారు . పవన్ కళ్యాణ్ స్తానిక MLA మరియు MP గోకరాజు గంగ రాజు తో కూడా ఫోన్ లో మాట్లాడారని సమాచారం .

శనివారమే పవన్‌ అమెరికా నుంచి వచ్చిన వెంటనే రమేష్‌నాయుడు కాల్ చేసారని రమేష్‌నాయుడు తెలిపారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని , ఆస్తిలపై  దాడులని  ఖండించారని , భౌతిక దాడులకు తానూ వ్యతిరేకిని, వర్గ వైషమ్యాలు, కులమతాలకు వ్యతిరేకిని, తన అభిమానులు కక్షసాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడే వైఖరిని వ్యతిరేకిస్తున్నా’’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసినట్లు, అందరు సినీ హీరోల అభిమాన సంఘాలతో,  రాజకీయ నాయకులతో  ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించినట్లు , రమేష్‌నాయుడు తెలిపారు .