చిరంజీవిని మోసం చేసింది పవన్‌ కల్యాణే

rp_roja-300x253-300x253.jpgవైఎస్ చనిపోగానే సీఎం కావాలనుకోవడం జగన్ అవివేకం, వారసులు ప్రతిభను నిరూపించుకుని రాజకీయాల్లోకి రావాలి , రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులున్నాయి, అవినీతీ ఉంది…. జగన్‌పై నాకు ఎందుకు వైరం ఉంటుంది అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్య కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది .

MLA రోజా మాట్లాడుతూ చిరంజీవిని మోసం చేసింది పవన్‌ కల్యాణే, పవన్‌తో పాటు అల్లు అరవింద్ కూడా చిరంజీవిని మోసం చేశారు. చిరంజీవికి అన్యాయం చేసినందుకు పవన్ కల్యాణ్‌ ముందుగా తనను తాను శిక్షించుకోవాలి.

వారసత్వం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే హక్కు లేదన్నారు , చిరంజీవి ని చూసి పవన్ కళ్యాణ్ పెట్టి సినిమాలు తీశారు అదే చిరంజీవి లేకపోతే పవన్ నే కాదు ఇతర మెగా హీరోలు కూడా ఉండరని అన్నారు రోజా .

జగన్ ఒక్క నాయకుడిగా ఎదిగి 2014 ఎలక్షన్స్ లో 67 సీట్స్లు సాధించారని , పోలవరం గురించి పవన్ కల్యాణ్ ఏనాడైనా మాట్లాడారా?, ప్రభుత్వం, టీడీపీ ఇబ్బంది పడుతుంటే పవన్ కల్యాణ్ తెరపైకి వస్తారు అన్నారు రోజా .