తెలుగు బాష లో నాకు నచని పదం ఆఫ్ట్రాల్ : పవన్ కళ్యాణ్

pawanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు, పవన్ గుంటూరు జిల్లా పెనుమాక చేరుకొని, అక్కడ రైతులతో సమావేశం అయ్యారు.

అక్కడ రైతులతో మాట్లాడుతూ ఇలా అన్నారు , ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆఫ్ట్రాల్.. మూడు వేల ఎకరాల కోసం ఎందుకింత రాద్ధాంతం? అని అన్నారు .మరి, ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తన భూమి పోతోందంటూ , తెలుగు దేశం MP మురళి మోహన్ హైదరాబాద్ రింగ్ రోడ్డులో భూమి పోయినపుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు ? అని ప్రశ్నించారు.

రైతుకు అన్నం పెడుతున్న భూమి విషయంలో మంత్రి కిషోర్ బాబు ఆఫ్ట్రాల్ అనే పదాన్ని ఉపయోగించడం చాల తప్పు . టిడిపి ఎమ్.పి భూమి కోల్పోయినప్పుడు అంత ఉన్నవాడికే బాధ ఉంటే, సెంటు,అర ఉన్న భూమి పోతే ఎంత బాధపడతారో తెలియదా అని పవన్ ప్రశ్నించారు. ఎంపీ గల్లా జయదేవ్ , మురళి మోహన్ స్వయంగా వచ్చి రైతుల బాధలు వినాలి, అని సూచించారు