మీడియాకు క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్

pawan-kalyan-apologizeఅమరావతి శంకుస్థాపనకు ఆహ్వాన పత్రిక అందించేందుకు రామానాయుడు స్టూడియోస్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగులో ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు , ఎమ్మెల్సీ టిడి జనార్థన్ తదితరులు శనివారం ఉదయం వెళ్లారు.

ఆహ్వాన పత్రం అందజేస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన ఓ ఛానల్ కెమెరామెన్‌పై భద్రతా సిబ్బంది దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనను జర్నలిస్టులు, కెమెరామెన్‌లో పవన్ దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ క్షమాపణలు చెప్పారు. ఈ గాటన లో తన తప్పు ఏమైనా ఉంటే క్షమించాలని కోరారు.

రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని, అందర్నీ సంతోష పెట్టేలా రాజధాని నిర్మాణం జరగాలని , హైదరాబాద్ తరహాలో కాకుండా అందరికీ ఉపయోగపడే రాజధాని అయి ఉండాలన్నది తన కోరిక అన్నారు.