మళ్లీ అత్తారింటికి దారేది కాంబినేషన్‌ లో

pawan-samathaPawan Kalyan and Samantha to share screen

పవన్‌ కల్యాణ్‌, సమంత కాంబినేషన్‌ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ గా నిలువడమే కాకుండా పవన్‌ కల్యాణ్‌ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .

ఇప్పుడు మళ్లీ వీరిద్దరినీ జంటగా నటించబోతున్నారని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఆ క్రేజీ కాంబినేషన్ కి సూత్రధారి మరెవరో కాదు , ‘అత్తారింటికి దారేది’ సినిమా దర్శకుడు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ .

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం లో మళ్లీ పవన్‌ కల్యాణ్‌, సమంత కనిపించబోతున్నారు . త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సమంతకు ఇది నాలుగో చిత్రం కానుంది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ చిత్రాల్లో సమంతనే కథానాయిక. అదే సెంటిమెంట్ తో సమంత పేరు పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రానికి దేవుడే దిగివచ్చినా’ అనే పేరు పరిశీలనలో ఉంది. హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు .