కాపు నాయకులకు పవన్ కల్యాణ్ దశ నిర్దేశం

pk4జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాపు నాయకులకు దశ నిర్దేశం చేశారు .

ఉద్యమంలో తాను నమ్మేది శాంతియుత మార్గం అని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళితే బాగుండేదన్నారు

ఒక ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు హక్కులు సాదించడానికి ఒక మార్గం ఉంటుందని,అది తప్పు దారి పడితే నష్టం జరుగుతుందని అన్నారు.

మహాత్మాగాందీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పోలీసులను తగులబెట్టినప్పుడు , ఈ చౌరాచౌరీ సంఘటన వల్ల స్వాతంత్రం పాతికేళ్లు లేటు అయిందని అన్నారు.

అలాగే నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడరాదని అన్నారు. ఉద్యమాన్ని నడిపే నాయకులు దీనిని వృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. హక్కులు తెచ్చుకోవడానికి ఓ ఎజెండా ఉంటుంది. కానీ, అది పక్కదారి పట్టకూడదు అన్నారు