భీమవరంలో పవన్‌ ఫ్లెక్సీని చించినందుకు ఫ్యాన్స్ రభస

pawan-fans-clash-bimavaamటాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకులను సందర్బంగా వెస్ట్‌గోదావరి జిల్లా భీమవరంలో కాస్త ఉద్రిక్త చోటుచేసుకొంది .

భీమవరంలో అర్థరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తులు పవన్‌ లేటెస్ట్‌ సినిమా సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ ఫ్లెక్సీని చించేశారు. విషయం తెలుసుకున్న పవన్‌ ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు.

అక్కడేవున్న మరికొందరి ఫ్లెక్సీలను చించి తగలబెట్టారు, రోడ్డుకు అడ్డంగా పవన్ ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు , అనుమానితుల ఇళ్లపై రాళ్లదాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఫ్యాన్స్‌ ను చెదరగొట్టారు.