టీడీపీ ఎంపీలు వ్యాఖ్యలకు పవన్ ట్విట్టర్‌లో కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేతల మధ్య మాటల యుధ్దం రోజురోజుకూ ముదురుతోంది. టీడీపీ ఎంపీలు తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు.

పవన్ తన సోమవారం ప్రసంగంలో టీడీపీ ఎంపీలు వ్యాపారాలపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై చూపడంలేదని విమర్శించారు. దీంతో పాటు ఎంపీ కేశినేని నానిపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అయితే పవన్ విమర్శలకు టీడీపీ ఎంపీలు కూడా ఘాటుగానే జవాబిచ్చారు.

దాంతో టీడీపీ ఎంపీలు తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇలా ఇచ్చారు సీమంధ్రా MPలు పౌరుషము నా మీద కాదు,కేంద్రం దగ్గర చూపించండి. నన్ను తిడితే ‘SPECIAL STATUS’రాదు . MPలు.. వ్యాపారము చేయడము తప్పు కాదు, కేవలం ‘వ్యాపారమే’ చేయడము తప్పు.