రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై పవన్ దిగ్భ్రాంతి

pawanరాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

ఈరోజు పుష్కరాలలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయపడిన వారికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను. అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా..దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావటం విరమించుకున్నాను.సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా ‘జనసేన’ కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.