సెక్షన్ 8 విధించడానికి తాను వ్యతిరేకo : పవన్

pawan4జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ , తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 విధించడానికి తాను వ్యతిరేకమని .

విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో సెక్షన్ 8 పేరుతో కేంద్రానికి అప్పగిస్తే మళ్లీ అన్యాయం జరుగుతుంది. ఉద్యమాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమైనా చెల్లుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం.. తర్వాత పక్షపాతం వహిస్తున్నారని అనిపిస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.ఎన్డీయే, యూపీఏలు ఒక కమిటీ వేసి, ఇక్కడి వ్యవహారాలు పరిశీలించేలా చూడండి.విభజన సమస్యలు తీర్చాల్సిన వాళ్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఇబ్బంది.

హైదరాబాద్ తెలంగాణ రాజధాని.. అందులో తిరుగులేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు ఇది ఉమ్మడి రాజధాని. ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయకండి.ఎంతసేపూ హైదరాబాద్ లాంటి నగరాన్ని తయారుచేయాలని ఏపీ పాలకులు చూడొద్దు. భవనాలు కట్టొచ్చు గానీ ప్రజలను తీసుకెళ్లలేరు.