పరకాల ప్రభాకర్‌ కమిట్‌మెంట్ లేని వ్యక్తి : పవన్

pk-7887రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు, రాజమండ్రిలో.

ఆవేశంతో, ఆకతాయితనంతో రాజకీయాల్లోకి రాలేదు… దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయొచ్చు… ప్రభుత్వంతో పనిచేయించడమే రాజకీయం అన్నారు పవన్.

ప్రజారాజ్యంలో నేర్చుకున్న పాఠాలతో జనసేన నిర్మించా… అందుకే పార్టీ నిర్మాణానికి దశాబ్ద కాలం పట్టింది. ప్రజారాజ్యంలో నిస్వార్థపరులు లేక పార్టీ నష్టపోయింది… లేకుంటే ఇప్పుడు చిరంజీవి సీఎంగా ఉండేవారు. నాకు వందల కోట్లు ఇచ్చేవాళ్లు లేరు… ఇచ్చినా తీసుకోను, రాజకీయంగా అమ్ముడు పోవడానికి నేను సిద్ధంగా లేను.

చిరంజీవి నోరులేని వ్యక్తి కాబట్టే పరకాల తిట్టేసి వెళ్లిపోయారు… ఆ సమయంలో నేను ఉంటే సందర్భం ఇంకోలా ఉండేది. పరకాల ప్రభాకర్‌లా కమిట్‌మెంట్ లేని వ్యక్తులు జనసేనలో ఉండొద్దు, పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదన్న వ్యక్తి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా… తన సతీమణిని కేంద్ర కేబినెట్‌లో కొనసాగిస్తున్నారు.

కాపు రిజర్వేషన్లపై పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు , విందు భోజనం పెడతామని ఆవకాయబద్ధ నాలుకకు రాసినట్టుంది. కులం అనేది ఒక అంశం… ఒక భ్రమ, చిరంజీవికి కాపు ముద్ర వేశారు… మరి పాలకొల్లులో ఎందుకు ఓడారు. అన్ని కులాల నుంచి నన్ను అభిమానించేవాళ్లున్నారు, అన్ని కులాలను గౌరవిస్తాను… ఏ కులాన్ని వెనుకేసుకురాను.

పీఆర్పీలో నన్ను నటుడిగానే చూశారు, సామాజిక స్పృహఉన్న వ్యక్తిగా చూడనందుకు బాధపడేవాడిని, పీఆర్పీని కాంగ్రెస్‌లో కలిపినప్పుడు నేను నిస్సహాయుడిని, నేను చిరంజీవి లాగా మెతక వ్యక్తిని కాదు, నన్ను కులానికి అటంగట్టినా, కుల నేతగా చిత్రీకరించినా… ఏస్థాయి వ్యక్తినైనా ఉపేక్షించను, మీ సంస్థల్లో ఆఫీస్ బాయ్ నుంచి కులాల లెక్కలు తీస్తా అన్నారు పవన్.