పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న తమిళ దర్శకుడు

panjaa2Panjaa sequel with Pawan Kalyan – పవన్ కళ్యాణ్ తో  ‘పంజా’  సీక్వెల్ ప్లాన్ చేస్తున్న తమిళ దర్శకుడు

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌, తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పంజా’ మెగా అభిమానులను నిరుత్సాహపరిచింది , ఐతే లుక్ పరంగా, స్టైల్ పరంగా ‘పంజా’ ఒక్క కొత్త పవన్ కళ్యాణ్ ని తెరమీద ఆవిష్కరించింది .’పంజా’ కొత్తగా ఉన్నా మైనస్‌ పాయింట్స్‌ ఎక్కువయిపోవడంతో సినిమా ప్లాప్‌ అయిపోయింది.

అయితే ఇపుడు దర్శకుడు విష్ణువర్థన్‌ ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసున్నాడని ఫిలిం నగర్ లో టాక్ , ‘పంజా’ సీక్వెల్ తో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడట.

‘పంజా’ సీక్వెల్ స్క్రిప్ట్ చెప్పడానికి పవన్ కళ్యాణ్ అప్పాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడట మన స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్థన్‌ . మరి పవన్ అప్పాయింట్మెంట్ ఇస్తాడో లేదో చూడాలి .