ఆత్మహత్యల పై దుష్ప్రచారం : కెసిఆర్

kcr-governorతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల ఆత్మహత్యలపై స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల పై  దుష్ప్రచారం జరుగుతోందిని కెసిఆర్ వ్యాఖ్యానించారని సమాచారం .

ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో కలిసినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. విపక్షాలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నట్లు సమాచారం. తెలంగాణ రైతులకు విత్తనాలు, కరంటు, ఎరువుల కొరతలేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, అన్ని విదాలుగా సాయం చేయడానికి కృషి చేస్తోందని , చనిపోయెన రైతుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల పరిహరం ప్రకటించిందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. కేసీఆర్ తన చైనా పర్యటన వివరాలను తెలిపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ లో గత 15 నెలలలో  ప్రభుత్వం లెక్కల ప్రకారం 431 రైతులు ఆత్మహత్య చేసుకొన్నట్లు  రికార్డ్లు చెపుతున్నాయి .  నిన్నటికి  నిన్న నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు.