రేవంత్ దూకుడుకు ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరు : గీతా

revanth-wifeఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ లభించిన సందర్బంలో ఆయన సతీమణి గీతా మీడియాతో మాట్లాడారు.

రేవంత్ దూకుడుకు ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరని, కష్టకాలంలో తమకు మద్దతుగా ఉన్న కార్యకర్తలు, ఇంకా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ బయటకు రావడంతో తమకు ఇంకా ధైర్యం వచ్చిందని, ఈ కేసును గట్టిగానే ఎదుర్కుంటారని ఆమె అన్నారు.రాజకీయంగా ఇబ్బంది వస్తుందని అనుకున్నాము కాని, వ్యక్తిగతం గా వస్తుందని అనుకోలేదని అన్నారు.ఇప్పుడు ఈ అనుభవంతో రాటు తేలే అవకాశం ఉందని,తమకు ఇది కొత్త అనుభవం అని ,అయినా ధైర్యంగా ఉన్నామని అన్నారు. ఈ దెబ్బతో ఆయన వెనక్కి తగ్గుతారని అనుకోనవసరం లేదని,ఇకపై కూడా పోరాటం చేస్తారని ఆమె అన్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ మంత్రులు పండుగ చేసుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు రేవంత్ బెయిల్ విషయం తెలియగానే స్వీట్లు తెప్పించి ఆయన కూడా తిన్నారు.