జనసేనను విస్తరించడానికి డబ్బు లేదు : పవన్ కళ్యాణ్

pawankalyanjanasenaజనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయవాడ క్యాంపు ఆఫీసు లో సమావేశం జరిగింది .

మీడియాతో మాట్లాడుతూ , జనసేనను రాజకీయపార్టీగా మార్చడానికి, విస్తరించడానికి తన వద్ద అంత డబ్బు లేదని , కానీ 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో హైదరాబాద్ నగరంతో జనవరి 2016 లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రస్తావన రాలేదని తెలిపారు

రాజధాని ప్రాంతంమే కాకుండా అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలనీ , రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. రాజధాని భూముల విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మిగిలిన భూములను సమీకరిస్తామని కోరారు పవన్‌కల్యాణ్ .