రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో సరికొత్త ట్విస్ట్ – ఆ నలుగురూ ఎవరు?

Rishiteswari dairyనాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో సరికొత్త ట్విస్ట్ .. ఆమె రాసుకున్న వ్యక్తిగత డైరీలో రాసిన ఆ నాలుగు పేర్లను కొట్టేసి మిస్టర్ ఎక్స్ అని వ్రాసారు .

రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రిన్సిపల్, సీనియర్ విద్యార్థులే కారణమంటూ వార్తలొస్తున్న తరుణంలో రిషితేశ్వరికి ఆమె స్నేహ బృందంలోని ఓ విద్యార్థి ‘ఐలవ్ యూ’ చెప్పాడట. సూర్యలంక బీచ్‌కు వెళ్ళి ఆటోలో తిరిగి వస్తున్నప్పుడు సీనియర్స్‌ చాలా పైశాచికంగా, అసభ్యకరంగా ప్రవర్తించారని, అతన్ని ప్రేమించాలని తనని తీవ్రంగా వత్తిడి చేసారని తెలిపింది .

ఏప్రిల్‌ 18న జరిగిన ఫ్రెషర్స్‌ డే పార్టీలో అంతా తప్ప తాగి అసభ్యంగా ప్రవర్తించారని, తాగిన మత్తులో చరణ్‌ నా ఒంటి మీద చెయ్యేశాడని. తన  జీవితంతో అత్యంత దుర్భరమైన క్షణాలవి. అతనసలు తనన్నెలా తాక గలిగాడని? ఈ విషయాన్ని తన నాన్నతో చెప్పుకోలేను. అలాగని తనూ భరించలేకపోతున్నానని … ఆ రోజే సగం చచ్చిపోయానని .. ఆత్మహత్య చేసుకోవాలని అప్పుడే అనుకున్నానని  వ్రాసింది రిషితేశ్వరి.

తాను నమ్మిన ఓ విద్యార్థిని తనను మోసం చేసిందని డైరీలో రాసుకుంది. ప్రేమను తిరస్కరించడంతో ఆ సీనియర్ విద్యార్థి అసభ్యకర మెసేజ్‌లు పెట్టేవాడని రిషితేశ్వరి తెలిపింది. ఆ నలుగురి పేర్లను డైరీలో రాసింది అయితే,  పేర్లను ఎవరో చెరిపేసారు. ఆ నలుగురూ ఎవరు?