మురుగదాస్ దర్శకత్వంలో ప్రభాస్-నీల్ నితిన్ థ్రిల్లర్ మూవీ

neilnitin-prabhas759బాహుబలి లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన ప్రభాస్ , తన తదుపరి చిత్రానికి సమాయత్తమవుతున్నాడు . ఇప్పటికే కథ చర్చలు పూర్తయింది సమాచారం .ప్రభాస్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు సాగుతున్నాయని , ప్రభాస్ బాహుబలి పార్ట్ 2 తర్వాత ఈ థ్రిల్లర్ మూవీ నటిస్తాడని టాక్. మురుగదాస్ దర్శకత్వంలో ప్రభాస్-నీల్ నితిన్ కలయికలో ఓ త్రిభాషా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రంలో రెండో లీడ్ లో నటించేందుకు నీల్ నితిన్ ముఖేష్ ని మురుగదాస్ కలిశారు. ఆ సంగతిని ఈ బాలీవుడ్ నటుడు స్వయంగా రివీల్ చేశాడు.మురుగదాస్ తో కలిసి ప్రభాస్ సోదరుడు నన్ను ఇదివరకే కలిశారు. ముంబైలో డిన్నర్ చేస్తూ మాట్లాడుకున్నాం. సౌత్ లో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చే అనువాద చిత్రాలు రెగ్యులర్ గా చూస్తుంటా. తెలుగు సినిమా స్క్రీన్ ప్లే లు బావుంటాయి. కొత్త ఎటెంప్ట్ చేస్తున్నారని ప్రశంసించాడు. ప్రభాస్ గొప్ప నటుడని ఆకాశానికెత్తేశాడు.