వీర్యదానం చేసేందుకు నవంబర్‌ 4న రానున్న నరుడా..డోనరుడా

naruda-donarudaసుమంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నరుడా..డోనరుడా!’ నవంబర్‌ 4న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

‘వీర్యదానం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా , బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా “విక్కీ డోనార్ ” సినిమా రీమేక్ . అన్నపూర్ణా స్టూడియోస్‌ సమర్పణలో రమా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేషన్స్‌ పతాకాలపై వై.సుప్రియ, సుధీర్‌ పూదోట నిర్మించారు. ఈ సినిమా కి మల్లిక్‌రామ్‌ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లును నాగార్జున విడుదల చేయగా , మహేష్ బాబు ట్రైలర్‌ విడుదల చేసారు . ఈ నెల 27న ఆడియో ప్లాన్ చేసారు నిర్మాతలు .

వీర్యదాతగా సుమంత్‌, ఇన్‌ పెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డా.ఆంజనేయులు పాత్రలో తనికెళ్ళ భరణి , హీరోయిన్ గా పల్లవి సుభాష్‌ నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, సుమన్‌శెట్టి, భద్రమ్‌, జబర్‌దస్త్‌ శేషు, సుంకర లక్ష్మి, పుష్ప, చలపతిరాజు తదితరులు నటిస్తున్నారు.