‘నాన్నకు ప్రేమతో’ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్

nannakuprematho-1యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో.

ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. టీజర్‌ను ఈనెల 21న విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబ్‌లో 10 లక్షల హిట్స్ వచ్చాయి, అలాగే 25 వేల లైక్స్‌ కూడా వచ్చాయి . యు ట్యూబ్ లెక్కల ప్రకారం విడుదలైన మూడు గంటల్లోనే దాదాపు 3 లక్షల మంది ఈ టీజర్‌ను వీక్షించినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

దగ్గుబాటి వెంకటేశ్, ‘కంచె’ చిత్ర దర్శకుడు క్రిష్, యువ హీరోలు ఆది, వరుణ్ సందేశ్, వెన్నెల కిషోర్ ఈ టీజర్‌ ను లికె చేసిన వారిలో ఉన్నరు.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.