‘నాన్నకు ప్రేమతో’ టీజర్ సరికొత్త రికార్డ్

nannakuజూ ఎన్టీఆర్ తాజా సినిమా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డ్లు సృష్టింస్తోంది . సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతొన్న ఈ సినిమా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో అభిమానులను ఆకట్టుకొంది.

దసరా కానుకగా రిలీజ్ చేసిన 30 సెకండ్ల సినిమ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతున్నది. టీజర్ రిలీజైన వారం రోజుల్లోనే 20 లక్షల వ్యూస్ తో 35+ వేలకు పైగా లైక్స్ తో యూట్యూబ్ లో సంచలనం రేపుతూ సరికొత్త రికార్డ్లు సృష్టింస్తోంది .

ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ట్రైలర్ కు గానీ టీజర్ కు గానీ రానటువంటి లైక్స్ ‘ నాన్నకు ప్రేమతో’ టీజర్ కు రావడం , ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని ఎన్ని సంచలనాలు సృష్టింస్తుందో !.

టీజర్ కు  వచ్చిన రెస్పాన్స్ చూసి  ఎన్టీఆర్ ఇలా త్వీట్  చేశారు ,  “Overwhelmed with the amazing response.#NannakuPremathoTeaser crosses the 2 million mark with 39k likes.a big boost to the whole team.”.