లిబియాలో కిడ్నాప్ కు గురైన వారి కుటుంబలకు చంద్రబాబు భరోసా

naiduలిబియాలో కిడ్నాప్ కు గురైన తెలుగు ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఓదార్చారు . శనివారం తెలుగుదేశం ఎంపీ మల్లారెడ్డి వారిని సీఎం క్యాంపు కార్యాలయానికి తోడ్కొని వచ్చారు . జులై 29 న కిడ్నాప్ కు గురైన ప్రొ.గోపీకృష్ణ , ప్రొ . బలరామ్ లను ఇంతవరకు విడుదల చేయకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సీఎం వద్ద తీవ్ర ఆవేదనను, ఆందోళనను వెలిబుచ్చారు.
‘ధైర్యంగా ఉండాలని , ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తో మాట్లాడతానని’ చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహన రావు దీనిపై ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారంటూ, ప్రొఫెసర్లు ఇద్దరూ క్షేమంగా తిరిగి వస్తారని వారిలో భరోసా నింపారు.
సోమవారం ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులను తాను దగ్గరుండి ఢిల్లీకి తీసుకు వెళ్తున్నట్లుగా ఎంపీ మల్లారెడ్డి సీఎం చంద్రబాబుకు వివరించారు. తాము చేయాల్సిందంతా చేస్తామని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు వారిని ఓదార్చారు.
సీఎంను కలిసినవారిలో గోపీకృష్ణ భార్య కళ్యాణి , బలరాం భార్య శ్రీదేవి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.