ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఒక్క ప్రాణం బలి

munikotireddyఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతి కాంగ్రెస్‌ సభలో వంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న మునికోటి చెన్నైలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు.

తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి, మంచాల వీథిలోని టీ.నగర్‌ కాలనీకి చెందిన వక్తి , ఆయనకు తల్లి దండ్రులు లేరు. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు.

మెరుగైన వైద్యం కోసం ఈ రోజు ఉదయమే వేలూరు సీఎంసీ నుంచి చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునికోటి చనిపోయారు.