భోజనం పెడతామని టిఫిన్ పెడుతున్నారు : ముద్రగడ

mudragadaకాపు నేత ముద్రగడ పద్మనాభం, కాపు, బలిజ, తెలగ, ఒంటరిలకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ శనివారం ఉభయ సభల్లో బిల్లుపై స్పందించారు

5 శాతం రిజర్వేషన్లు ఆమోదయోగ్యం కాదు… మాకు 10 శాతం రిజర్వేషన్లు కావాలి, అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు ఆమోదిస్తే ఒరిగేదేమీ ఉండదు… 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే మాకు నిజమైన దీపావళి, ఢిల్లీలో రిజర్వేషన్లను ఆమోదింపజేసే బాధ్యత సీఎందే… పూర్తిస్థాయి రిజర్వేషన్ ఫలితాలు వచ్చాకే సంబరాలు.

ఏపీలో కాపుల సంఖ్యను తక్కువ చూపించారు… ముఖ్యమంత్రిగారు భోజనం పెడతామని టిఫిన్ పెడుతున్నారు. రాష్ట్రంలో కాపులు కోటికి పైగా ఉండగా నివేదికలో 50 లక్షల మంది మాత్రమే ఉన్నారని ప్రకటించడం బాధాకరమన్నారు. నిష్పత్తి ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కాపులకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కావాలి. 2018 మార్చి వరకు ఉద్యమం వాయిదా. లేదంటే మార్చి తర్వాత ఉద్యమ పంథా కొనసాగుతుందన్నారు.