ఎంపీ కవిత పాదయాత్ర

kavitha-387774నిజామాబాద్ ఎంపీ కవిత కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో మన ఊరు- మన ఎంపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల మండలంలోని వంజరిపల్లె, మోతె, తిమ్మాపూర్ గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర చేస్తూ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

మోతె గ్రామంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు, మహిళా భవనం నిర్మాణం కోసం రూ. 5 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్-రెడ్డి పాల్గొన్నారు. పల్లెల్లో సమస్యలు తీర్చడానికి గ్రామజ్యోతి కార్యక్రమంలో యువత పాల్గొనాలని కవిత పిలుపునిచ్చారు.