బాబు కు సుప్రింకోర్టులో ఊరట

mohan babuప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కు సుప్రింకోర్టులో ఆయనకు ఊరట లభించింది.కొద్ది నెలల క్రితం మోహన్ బాబు తన సినిమాలలో టైటిల్స్ లో పద్మశ్రీ వాడుకున్నారని ఆరోపిస్తూ వచ్చిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మోహన్ బాబు పద్మశ్రీ బిరుదును దుర్వినియోగం చేశారని భావించింది.

ఆ సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దాంతో మోహన్ బాబు సుప్రింకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.మోహన్ బాబుకు యధాతధంగా పద్మశ్రీ బిరుదును కొనసాగించాలని నిర్ణయించింది.మోహన్ బాబు తాను పద్మశ్రీని దుర్వినియోగం చేయబోనని అఫిడవిట్ ఇవ్వడంతో హైకోర్టు తీర్పును సుప్రింకోర్టు పక్కన పెట్టింది.