‘బ్రూస్‌లీ’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాస్ లేక ఫెయిల్ ?

bruceleeమెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’ చిత్రంలో అతిథి పాత్రలో దాదాపు 8 సంవత్సరాల తరువాత మళ్లి వెండి తెరపై అభిమానులకు కనిపించరు.

అక్కాతమ్ముళ్ల బంధం నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది , రామ్ చరణ్ కంటే చిరంజీవిని చూడ్డానికే ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా వున్నారనేది థియేటర్లలో జనాలను చూస్తే అర్థమవుతుంది. చిరంజీవి అతిథిపాత్రలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

చిరంజీవి విషయాని వస్తే ఆయన ఆడియో వేడుకలో చెప్పినట్లే. స్క్రీన్‌పై నన్ను నేను చూసుకున్నాక.. హమ్మయ్యా! పాస్‌ అయిపోయాను చాలు అన్నట్లు , సినిమా చూశాక ప్రక్షకులకు కూడా చిరంజీవి పాస్‌ అయ్యారనే చెప్పుకొంటున్నారు . చిరంజేవి స్టైల్, మన్నెర్ ఇస్ం , ఆక్షన్ , బాడీ లాంగ్వేజ్ , అన్ని జస్ట్ 5 నిమిషాలో వ్యవధిలో చెపించేసారు మన మెగా స్టార్ .

రాంచరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ‘బ్రూస్‌లీ’ , శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.