అప్పుడు ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ , ఇది మెగా హీరోల ప్లానింగ్

dhruva-audioMega heroes planning

అప్పుడు ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ , ఇది మెగా హీరోల ప్లానింగ్ … అప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సర్రైనోడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు . ఇప్పుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా ‘ధృవ‌’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా వరంగల్ లో జరిపే ఆలోచనలో ఉన్నారనేది తాజా సమాచారం.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ సినిమా ఆడియో వేడుక నిర్వ‌హించ‌కుండా ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఈ నెల 9వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుద‌ల చేసున్నారు .

ఐతే , ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరపనున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఈ ఫంక్షన్ ను వరంగల్ లో నిర్వహించాలని డిసైడ్ ఇయ్యారని సమాచారం .