మందుబాబులకు మంచాక్క కౌన్సిలింగ్

manchu-lakshmiటాలీవుడ్ సెలబ్రిటీలు కు హైదరాబాద్ పోలీసులు వీకెండ్ లో చుక్కలు చూపిస్తున్నారు .

వీకెండ్ లో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో మంచు లక్ష్మీ కారును కూడా ఆపి చెకింగ్ చేశారు. ఎలాంటి ఆల్కహాల్ తీసుకోకపోవడంతో పోలీసులు ఆమె కారును పంపించివేశారు. మంచులక్ష్మీతో పాటు జయప్రద కూడా ఉన్నారు.

మంచులక్ష్మీ ..ఎవరూ మందు తాగి డ్రైవ్ చేయవద్దని కోరింది.మరియు పోలీసుల పనితీరును మెచ్చుకుంది. మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మంచు లక్ష్మీప్రసన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెతో కౌన్సిలింగ్ ఇప్పించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మంచు మనోజ్ ని కూడా పోలీసులు చెక్ చేశారు.