శేఖర్ కమ్ములతో పనిచేయడానికి మహేశ్ బాబు ఓకే

Sekhar-Kammula-To-Direct-Mahesh-Babu-_2012_10సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో వినూత్నమైన కాంబినేషన్‌కు తెర తీశారు , శేఖర్ కమ్ములతో పనిచేయడానికి ఓకే చెప్పారు అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత ఈ ప్రాజెక్టునే పట్టాలెక్కించాలని మహేశ్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ స్క్రిప్టు పనిలోనే శేఖర్ బిజీగా ఉన్నారట.

నిజానికి ‘గోదావరి’ సినిమా మహేశ్‌తోనే తీయాలని శేఖర్ భావించారట. అయితే అప్పుడు ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఆ అవకాశం వచ్చింది.