శ్రిమంతుడితో తొలి హిట్ అందుకొన్న మహేష్ బాబు

srimanthudu-mahesh మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమంతుడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాక్సీఫీసు కలెక్షన్లలో రికార్డ్ క్రియేట్స్ చేస్తున్న ఈసినిమాతో నిర్మాణరంగంలోకి దిగిన మహేష్ తొలి హిట్ అందుకున్నాడు.

మహేష్ బాబు ఎంటర్ టైన్స్ మెంట్స్ బ్యానర్ లో తొలిసారి తీసిన శ్రీమంతుడు నిర్మాతగా మహేష్ కి మొదటి విజయాన్ని అందించింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ తో పాటు సహనిర్మాతగా మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకి ఉన్నాడు.

తొలి వారాంతానికి రూ.40 కోట్లు షేర్ వసూలు చేసినట్లు చెబుతున్నారు. మళ్లీ ఓవర్సీస్ లో కూడా శ్రీమంతుడు అత్యధిక వసూళ్లు అందుకున్న రెండో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపిస్తున్న శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా నిజంగానే మహేష్ శ్రీమంతుడయ్యాడని చెప్పుకుంటున్నారు.