మహేష్ బాబు రియల్ లైఫ్ లోనూ శ్రిమంతుడే

srimanthudu-3663టాలీవుడ్ ప్రిన్స్ శ్రిమంతుది తో ముందు వచ్చిన మహేష్ బాబు ” ఊరంతటినీ దత్తత తీసుకున్నా”.. డైలాగ్ తో సందేశం ఇవ్వడమే కాదు . దానిని ముందు అతనే ఫాలో చేసి మార్గదర్శకుడు గా నిలిచాడు .

పుట్టుకతో నే శ్రిమంతుడిన మహేష్ సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో గా రూపాంతరం చెందాడు . ఇప్పటికే తన తండ్రి సొంతూరు బుర్రిపాలెంను దత్తత తీసుకుని రూపు రేఖలు మార్చేస్తానని హామీ ఇచ్చిన మహేష్ బాబు , తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు .

శ్రిమంతుది సినిమా చుసిన తెలంగాణా మంత్రి కే టి అర్ గ్రామజ్యోతిలో భాగంగా తెలంగాణలోనూ ఓ ఊరును దత్తత తీసుకోవాలని మహేష్ బాబు కు సూచించారు. కేటీఆర్ సూచన మేరకు మహబూబ్నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానంటూ ట్వీట్ చేశాడు.

మహేష్ బాబు ను ప్రేరణగా తీసుకోని మరికొందరు హీరోలు ముందుకి వస్తే గ్రామాలూ పట్టిసిమలుగా మారుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు .