ఏప్రిల్‌ 14న తెరపైకి వస్తున్నా మహేష్ బాబు

rp_Mahesh-babu-254x300-254x300-254x300-1-254x300-1-254x300-254x300.jpgసూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కొత్త సినిమా విడుదల ముహూర్తం ఫిక్స్ చేసారు . తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ రూపొందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న తెరపైకి రానున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది, 60 శాతం షూటింగ్‌ పూర్తి అయ్యిందని సమాచారం . హైదరాబాద్‌, చెన్నైలో షెడ్యూల్స్‌ చేశారు. ఇందులో ఆక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది . తరవాతి షెడ్యూల్స్‌ నవంబర్ 3 నుంచి ప్రారంభమౌతుంది . చిత్ర యూనిట్ 15 రోజుల షెడ్యూల్ కోసం అహ్మదాబాద్ వెళ్లనున్నారు . డిసెంబర్‌ లో టాకీ పార్టు, జనవరి కల్లా మొత్తం షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని ఆలోచనతో ఉన్నారు .

తర్వాత రెండు నెలలు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొని , ఏప్రిల్‌ 14న ఈసినిమా తెరపైకి రానున్నట్లు తెలిసింది. మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కుతోందీ చిత్రం.