బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొన్న మహేష్ బాబు

mahesh Babu

mahesh babu adopts burripalem

సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా మహేష్ బాబు శ్రిమంతుడే , శ్రీమంతుడు సినిమాలో చూపించిన గ్రామదత్తతను రియల్ లైఫ్ లోనూ చూపించాలనుకుంటున్నాడు. తన తండ్రి పుట్టి పెరిగిన ఊరు , గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలో ఉన్న బుర్రిపాలెంని దత్తత తీసుకుంటున్నట్లు శ్రీమంతుడు సక్సెస్ మీట్ లో ప్రకటించాడు.

ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందడం సంతోషంగా ఉందని, కథ నచ్చడంతోనే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశామని ముందుగా అనుకున్నట్లే సినిమాలోని మెయిన్ పాయింట్ నే ప్రమోషన్ లోనూ హైలెట్ చేయడంతో సినిమా మంచి సక్సెస్ ని అందుకుందని ఆనందం వ్యక్తం చేశాడు .

ఆదివారం శ్రీమంతుడు సినిమా టీం ప్రెస్ మీట్ లో పాల్గొంది. కెరియర్ లో ఉత్తమ చిత్రం అంటూ ప్రశంసలు వస్తున్నాయని మహేశ్ చెప్పారు.