తెలివితేటల్లో లోకేష్‌ జలీల్‌ఖాన్‌ను మించిపోయారు : రోజా

rp_roja-300x280.jpgఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ను ఎమ్మెల్యే,వైఎస్ ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం అద్యక్షురాలు రోజా విమర్శించారు.

వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె చంద్రబాబు కుమారుడు లోకేష్ తెలివితేటల్లో జలీల్ ఖాన్ ను, అబద్ధాలలో చంద్రబాబును మించిపోయారని రోజా విమర్శించారు.

చంద్రబాబు ఏ ఎన్నికల హామీని నెరవేర్చలేదు,మామ నియోజకవర్గం హిందూపురంలోనూ నీటి కష్టాలు తీర్చలేదు, నగరి నియోజకవర్గంపై కక్షపూనారని , నగరి సమస్యలపై ఎంత పోరాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించడం లేదని, అన్నారు.

తెలివితేటల్లో లోకేష్‌ జలీల్‌ఖాన్‌ను మించిపోయారు,సోషల్‌ మీడియాపై కేసులు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. కేసులు పెడితే ముందు లోకేష్‌పైనే పెట్టాలి,చంద్రబాబు ఛీటింగ్‌ చీఫ్‌ మినిస్టార్‌ అని విమర్శించారు రోజా .