కేసీఆర్‌కు ఇప్పుడే జ్వరం వచ్చిందా ? :లోకేష్

lokeshతెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జ్వరం వచ్చిందన్న సమాచారంపై టిడిపి యువనేత లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఎదురు పడలేకనే గవర్నర్‌ విందుకు కేసీఆర్‌ గైర్హాజరయ్యారని విమర్శించారు. నాలుగు రోజులు ఫాంహౌస్‌లో రెస్ట్‌ తీసుకున్న కేసీఆర్‌కు ఇప్పుడే జ్వరం వచ్చిందా అని ప్రశ్నించారు

ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ హోం శాఖ కార్యదర్శి బి.వెంకటేషం ను బదిలీ చేయడంలో ఉద్దేశం ఏమిటని,పోన్ టాపింగ్ భయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కేసును డీల్ చేస్తున్న ఇంటెలిజన్స్‌ చీఫ్‌ దీర్ఘాకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు అని లోకేష్‌ ప్రశ్నించారు. టీ సర్కార్‌ నోటీస్‌లు ఇస్తే తమ నెత్తిన పాలు పోసినట్లేనని ఆయన అన్నారు. నోటీసులు ఇవ్వాలనే మేం కూడా కోరుకుంటున్నామని చెప్పారు.

వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న హెరిటేజ్‌ను హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టేందుకు టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం కేసీఆర్‌దని లోకేష్ ద్వజమెత్తారు.